బిజినెస్​Gold Silver Rates April 22 | బంగారం, వెండి ధరల్లో ఊగిసలాట.. మళ్లీ ఆల్‌టైమ్...

Gold Silver Rates April 22 | బంగారం, వెండి ధరల్లో ఊగిసలాట.. మళ్లీ ఆల్‌టైమ్ హై దిశగా ప‌రుగులు..!

మార్చి 23 నుంచి నిరంతరంగా పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు భారం అవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా యుద్ధ ఉద్రిక్తతల తగ్గుదల కారణంగా బంగారం ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Silver Rates April 22 | దేశంలో బంగారం ధరలు (Gold Rates) మళ్లీ పైపైకి పోతున్నాయి. ముఖ్యంగా మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఇప్పటివరకు కొనసాగుతుండటం గమనార్హం. గత నెల రోజులుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో నగలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది భారంగా మారుతోంది.

ఏప్రిల్ 21 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,290గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.1,42,350గా ఉంది. వెండి ధర (Silver Price) కిలోగ్రాముకు రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ గణాంకాల ప్రకారం మార్చి 22న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,970గా ఉండగా… ఇప్పుడు అది రూ.1,55,290కు చేరింది. అంటే నెల రోజుల్లోనే రూ.9,320 పెరిగింది.

Gold Silver Rates April 22 | యుద్ధ ప్రభావం ఎలా ఉంది?

అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) కూడా రూ.1,33,800 నుంచి రూ.1,42,350కు పెరిగి సుమారు రూ.8,550 మేర పెరిగింది. అంటే మార్చి 22న కొనుగోలు చేసిన వారు లాభపడ్డారని చెప్పవచ్చు. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు కారణంగా మొదట బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటం వల్ల పెట్టుబడిదారులు బంగారం నుంచి బయటకు వచ్చారు. కానీ మార్చి 23 నుంచి పరిస్థితులు మారాయి. యుద్ధ తీవ్రత తగ్గడం, చమురు ధరలు క్రమంగా పడిపోవడం, డాలర్  బలహీనపడటం వంటి అంశాలు బంగారం వైపు పెట్టుబడులను మళ్లీ మళ్లించాయి. వెండి కూడా ఇదే దారిలో సాగుతోంది. ఒక దశలో కిలోగ్రాముకు రూ. 4,20,048 గరిష్టాన్ని తాకిన వెండి ధర, ప్రస్తుతం దాదాపు రూ. 1,69,240 మేర తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

Gold Silver Rates April 22 | బంగారం, స్టాక్ మార్కెట్లపై దృష్టి

ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాల్పుల విరమణను నిరవధికంగా కొనసాగించడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. యుద్ధం మరింతగా తీవ్రతరం అయ్యే అవకాశాలు తగ్గడంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం, స్టాక్ మార్కెట్ల (Stock markets)పై దృష్టి పెట్టుతున్నారు. గతంలో మార్చి 1న బంగారం ధర రూ.1,73,090తో గరిష్టాన్ని తాకింది.

Gold Silver Rates April 22 | రెండు నెలల్లో రికార్డు స్థాయికి

ప్రస్తుతం ఉన్న ధరతో పోలిస్తే ఇంకా సుమారు రూ.17,800 పెరిగితే ఆ స్థాయిని మళ్లీ చేరుకోవచ్చు. గత నెలలోనే రూ.9వేలకుపైగా పెరిగిన బంగారం ధరలు ఇదే ట్రెండ్ కొనసాగితే మరో రెండు నెలల్లో రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్‌టైమ్ హై కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు అనేక అంతర్జాతీయ, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయని లేదా తగ్గుతాయని చెప్పడం కష్టం.

ఇది కూడా చదవండి..: April 22 market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. బలహీనతను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....