అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 442 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయాయి.
అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్ గా ట్రేడ్ అవుతుండడంతో దాని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో లాభాల స్వీకరణతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. లార్జ్ క్యాప్ స్టాక్స్ నష్టాలను అందించగా.. మిడ్, స్మాల్ క్యాప్ రంగాలు మాత్రం నిలకడను ప్రదర్శించాయి.
Stock Market | రోజంతా నష్టాల్లోనే..
సెన్సెక్స్ సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై 783 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ144 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ప్రారంభంతో 72 పాయింట్లు పైకి ఎగబాకినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి మరో 113 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు కాస్త కోలుకుని నష్టాలను తగ్గించుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 442 పాయింట్ల నష్టంతో 77,7068 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 24,238 వద్ద స్థిరపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,226 కంపెనీలు లాభపడగా 2,039 స్టాక్స్ నష్టపోయాయి. 249 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 124 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 107 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 స్టాక్ లాభపడగా.. 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 2.98 శాతం, పవర్‌గ్రిడ్ 1.82 శాతం, ఎన్టీపీసీ 1.57 శాతం, ఎయిర్టెల్ 1.55 శాతం, ఎస్బీఐ 1.51 శాతం లాభపడ్డాయి.
Top Losers : యాక్సిస్ బ్యాంక్ 5.48 శాతం, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 5.12 శాతం, మారుతి 2.18 శాతం, కొటక్ బ్యాంక్ 2 శాతం, ఇన్ఫోసిస్ 0.92 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు