Congo Ebola Outbreak | కలకలం రేపుతున్న ఎబోలా.. ఒక్కరోజే 37 మరణాలు

కాంగో దేశంలో ఎబోలా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Congo Ebola Outbreak | కాంగో దేశంలో ఎబోలా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాణాంతక వ్యాధి వేగంగా వ్యాపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. మే 15 నుంచి శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2,344 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 930 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం శుక్రవారం ఒక్కరోజే 37 మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Congo Ebola Outbreak | వైరస్ రకం , చికిత్స..

ప్రస్తుతం కాంగోలో ( Congo )నమోదవుతున్న కేసులు ‘బుండిబుగ్యో’ (Bundibugyo) ఎబోలా రకానికి చెందినవి. ఈ వ్యాధిని సమర్థవంతంగా అరికట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ వైరస్ అడవి జంతువులు, గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని (Bushmeat) తినడం ద్వారా వైరస్ మనుషులకు చేరుతుంది. అంతేకాకుండా, వైరస్ సోకిన వ్యక్తి నుండి వచ్చే శరీర ద్రవాల ద్వారా ఇది ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది.

Congo Ebola Outbreak |లక్షణాలు..

వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి సుమారు 21 రోజుల సమయం పడుతుంది. ప్రారంభంలో ఫ్లూ, మలేరియా లేదా జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే శరీరంలోని కీలక అవయవాలు విఫలమవుతాయి. కొన్ని తీవ్రమైన కేసుల్లో రోగి శరీరంలోపలా, బయటా అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) జరిగి ప్రాణాపాయం సంభవిస్తుంది.

ఇది కూడా చదవండి:  Vamsi Goud | బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా రత్నగారి వంశీ గౌడ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *