Ayodhya Ram Mandir SIT | అయోధ్య విరాళాల కేసులో కీలక పరిణామం.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్‌చిట్

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల చోరీ , నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ప్రకటన చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayodhya Ram Mandir SIT | అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల చోరీ , నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరిపిన సిట్.. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు క్లీన్‌చిట్ అందజేసింది. విరాళాల వ్యవహారంలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. గతంలో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును సమగ్ర విచారణ నిమిత్తం సిట్‌కు బదలాయించిన విషయం తెలిసిందే.

Ayodhya Ram Mandir SIT | పరిశీలన తర్వాతే నిర్ణయం..

ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు, బ్యాంక్ ఖాతాలు , ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారు. చోరీ అయిన నిధులకు, బ్యాంక్ లావాదేవీలకు ట్రస్ట్ ఉన్నతాధికారులకు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేదని సిట్ అధికారులు తేల్చిచెప్పారు. ఈ క్లీన్‌చిట్ ప్రకటనతో ట్రస్ట్ ప్రతినిధులపై గతంలో వచ్చిన నిరాధార ఆరోపణలకు పూర్తిస్థాయిలో తెరపడినట్లయింది. మరోవైపు, ఈ కేసులో అసలు నిందితులపై చట్టపరమైన తదుపరి చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Principal Harassment | నా కోరిక తీరిస్తే కాలేజీ ఫీజు మాఫీ చేస్తా.. ప్రిన్సిపాల్​ వేధింపులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *