అక్షరటుడే, వెబ్‌డెస్క్: Principal Harassment | ఒక ఇంటర్ విద్యార్థినిని కీచక ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. రాజస్థాన్ (Rajasthan) పుష్కర్ సమీపంలోని కదేల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని వద్ద రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేందుకు డబ్బులు లేవు. దీంతో తన తండ్రికి జీతం రాగానే డబ్బు చెల్లిస్తానని ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్‌కు బాలిక చెప్పింది. ఇదే అదునుగా.. తన కోరిక తీర్చాలంటూ ఆ విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. కాలేజీ ముగిశాక సాయంత్రం తనతో సమయం గడిపితే.. ఫీజు మాఫీ చేస్తానన్నాడు. అంతేగాకుండా విద్యార్థినిని అసభ్యంగా తాకుతూ.. బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.
Principal Harassment | దేహశుద్ధి
ప్రిన్సిపాల్ గది నుంచి బయటకు వచ్చి.. ఏడుస్తూ ఇంటికెళ్లి.. కుటుంబ సభ్యులు విద్యార్థిని విషయం చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు కాలేజీకి చేరుకొని.. ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ రిన్వాకు దేహశుద్ధి చేశారు. బాధిత యువతి కీచక ప్రిన్సిపాల్ ముఖానికి నల్ల రంగు పూసి.. అతనికి బుద్ధి చెప్పింది. అనంతరం కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపాల్ సుశీల్‌ను ఊరేగించి.. పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పుష్కర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అశోక్ బిషు తెలిపారు.
ఇది కూడా చదవండి..: UGC NET Re Exam | అభాసుపాలైన యూజీసీ-నెట్ పరీక్షల తీరు.. మూడు సబ్జెక్టుల ఎగ్జామ్స్ రద్దు.. రీ-ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల