అక్షరటుడే, వెబ్‌డెస్క్: Milky Mist IPO | దేశంలో ప్రముఖ పాల, ఘనీభవించిన ఆహార ఉత్పత్తుల కంపెనీలలో ఒకటైన మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ కంపెనీ.. మిల్కీ మిస్ట్, స్మార్ట్ చెఫ్, కాపెల్లా, మిస్టీ లైట్, బ్రియాస్, అసల్ తదితర బ్రాండ్స్ పేరుతో చీజ్, పనీర్, బట్టర్, నెయ్యి, పెరుగు, యోగర్ట్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తయారు చేసి విక్రయిస్తుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ నుంచి రూ. 1,553 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 1,428 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 125 కోట్లు సమీకరించింది.
Milky Mist IPO | భారీ డిమాండ్..
మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో (IPO) బిడ్డింగ్ ఆగస్టు 11న ప్రారంభమై 13న ముగిసింది. ఈ పబ్లిక్ ఇష్యూకు భారీ స్పందన లభించింది. మొత్తం ఇష్యూ 59 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 164 టైమ్స్, ఎన్ ఐఐ కోటా 36.75 రెట్లు, రిటైల్ కోటా 8.86 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
Milky Mist IPO | తొలిరోజు 29.64 శాతం లాభాలు..
కంపెనీ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరును కంపెనీ రూ. 140 కి విక్రయించగా.. 17.86 శాతం ప్రీమియంతో రూ. 165 వద్ద లిస్టయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే రూ. 181.50 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి తొలిరోజే 29.64 శాతం లాభాలు వచ్చాయి.
ఇది కూడా చదవండి..: Sunshine Pictures IPO | ఐపీవోకు ‘కేరళ స్టోరీ’ నిర్మాణ సంస్థ.. ఎంత లిస్టింగ్ గెయిన్స్ రావొచ్చంటే?