బిజినెస్​FDI in Insurance | ఇన్సూరెన్స్ కంపెనీల్లో వందశాతం ఎఫ్​డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

FDI in Insurance | ఇన్సూరెన్స్ కంపెనీల్లో వందశాతం ఎఫ్​డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

బీమా రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో వంద శాతం ఎఫ్​డీఐలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: FDI in Insurance | బీమా రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐ)కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే ఇప్పటి వరకు ఇది 74 శాతంగా ఉండేది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీలో ఇప్పుడు ఉన్న 20 శాతం ఎఫ్​డీఐ మాత్రం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇన్సూరెన్స్ మార్కెట్​లో పోటీ మరింత పెరగనుంది. దీంతో ప్రీమియం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

FDI in Insurance | నిబంధనలకు లోబడే..

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు 1938 నాటి బీమా చట్టం (4 ఆఫ్ 1938) నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) స్వీకరించే కంపెనీలు బీమా, సంబంధిత కార్యకలాపాలను చేపట్టడానికి రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా నుంచి అవసరమైన లైసెన్స్ లేదా అనుమతి పొందాల్సి ఉంటుంది.

FDI in Insurance | గత డిసెంబర్​లో బిల్లుకు ఆమోదం..

బీమా రంగం వృద్ధితో పాటు ప్రీమియంలను తగ్గించడం, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ఎఫ్​డీఐలను 74 శాతం నుంచి వంద శాతానికి పెంచే బిల్లును గతేడాది డిసెంబర్‌లోనే పార్లమెంట్ ఆమోదించింది. కేంద్రం తాజా నిర్ణయంతో మరిన్ని కంపెనీలు దేశంలోకి రావడంతో పాటు పోటీ పెరిగే అవకాశంతో పాటు ప్రీమియంలు తగ్గే ఛాన్స్​ ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bathukamma Kunta | బ‌తుక‌మ్మ‌ కుంట ముమ్మాటికీ చెరువే : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma Kunta | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని...

Bharosa Center | బాలల, మహిళల రక్షణకు అండగా భరోసా సెంటర్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bharosa Center | బాలల, మహిళల రక్షణకు...

KTR comments | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు : కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR comments | కాంగ్రెస్​ మళ్లీ అధికారంలోకి...

Collector ila tripathi | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, బోధన్: Collector ila tripathi | అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నివర్గాల...