అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sunshine Pictures IPO | సన్‌షైన్ పిక్చర్స్ ను 2007లో ఏర్పాటు చేశారు. దీనికి సినిమా, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ రూపొందించడంతో పాటు వాటికి సంబంధించిన స్క్రిప్ట్స్ డెవలప్ చేయడం, నిర్మించడం, రైట్స్ మోనిటైజెషన్, డిస్ట్రిబ్యూషన్ లలో అనుభవం ఉంది.
ఈ సంస్థ ఇప్పటివరకు వివిధ స్టూడియోలతో కలిసి 10 కమర్షియల్ చిత్రాలను నిర్మించింది. ఇందులో కేరళ స్టోరీ, బస్తర్ వంటి చిత్రాలున్నాయి. వీటితోపాటు 2 టీవీ సీరియళ్లు, ఒక షార్ట్ కమర్షియల్ ఫిల్మ్‌కు నిర్మాణ సంస్థగా వ్యవహరించింది. జియో స్టూడియోస్‌తో కలిసి రెండు కమర్షియల్ చిత్రాలను, ప్రసారభారతి కోసం ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తోంది.
Sunshine Pictures IPO | రూ. 282.14 ఐపీవో..
కంపెనీ రూ. 282.14 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో (IPO)కు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 48,00,034 షేర్లు విక్రయించడం ద్వారా రూ. 173 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 30,37,157 షేర్లను అమ్మి రూ. 109 కోట్లు సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది .
Sunshine Pictures IPO | ప్రైస్ బ్యాండ్
కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 342 నుంచి రూ. 360 లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 41 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,760 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కోటా : క్యూఐబీలకు 50 శాతం వాటా, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు.
జీఎంపీ : సన్ షైన్ పిక్చర్స్ లిమిటెడ్ ఐపీవోకు సంబంధించి గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 73 గా ఉంది. ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 20 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 18న ప్రారంభమైంది. బిడ్డింగ్ విండో 20వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 21న రాత్రి వెలువడే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 25న బీఎసఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Aug 18 Gold Market | దేశీయ బులిటెన్ మార్కెట్‌లో బంగారం ధరలు పైపైకి