June 05 Market Analysis | మిశ్రమంగా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 05 Market Analysis | వాల్‌స్ట్రీట్ గత సెషన్‌లో మిశ్రమంగా ముగిసింది. యÖరోపియన్ మార్కెట్లు లాభపడ్డాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి.

ప్రపంచ మార్కెట్ల నుంచి అందుతున్న మిశ్రమ సంకేతాలు, ఆర్బీఐ విధాన ప్రకటన నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

akshara today 1 5.jpgmarket 5
May 19 Market Analysis

June 05 Market Analysis | US మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.09 శాతం నష్టపోగా.. ఎస్ అండ్ పీ 0.41 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.03 శాతం నష్టంతో ఉంది.

June 05 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.14 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.60 శాతం, యÖకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.27 శాతం పెరిగాయి.

June 05 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో చైనాకు చెందిన షాంఘై 0.32 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.02 శాతం లాభాలతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 3.36 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.31 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.28 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.44 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.10 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

akshara today 1 12.jpgmarket 12

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ ఐఐలు వరుసగా 7వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,447 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 13వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,360 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.02 నుంచి 1 కి తగ్గింది.
  • విక్స్ 2.41 శాతం తగ్గి 15.88 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.52 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 95.79 వద్ద ఉంది.
  • US డాలర్ ఇండెక్స్ 99.41 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.47 వద్ద ఉన్నాయి.

ఈ రోజు ఉదయం 10 గంటలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన నిర్ణయం వెలువడనుంది. రెపో రేటును యథాతథంగా ఉంచుతారని మార్కెట్ ఆశిస్తోంది.

అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్య లభ్యత పరిస్థితులు, ముడి చమురు ధరల ప్రమాదాలు, రూపాయిపై కేంద్ర బ్యాంకు ఇచ్చే వివరణ కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.

Rajesh Exports KTR | ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ సెబీ సెన్సేషన్.. తెలంగాణ రాజకీయాల్లో ‘గోల్డ్ స్కామ్’ మంటలు.. కేటీఆరే టార్గెట్‌గా విపక్షాల దాడి!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *