Stock Market india | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market india | దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. మంగళవారం సెన్సెక్స్ (sensex) 479 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయాయి.

Stock Market india | శాంతి అంటూనే ఇరాన్​పై అమెరికా దాడులు..

అమెరికా(America) శాంతి అంటూనే ఇరాన్‌పై (Iran) తీవ్రమైన దాడులకు పాల్పడడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ముగిశాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.

Stock Market india | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం గ్యాప్ డౌన్ లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 264 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా క్రమంగా పుంజుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 403 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 27 పాయింట్ల నష్టంతో ప్రారంభమె మరో 39 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 124 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 718 పాయింట్లు, నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద స్థిరపడ్డాయి.

మిక్స్‌డ్‌గా సూచీలు..

నిఫ్టీలో యుటిలిటీ ఇండెక్స్ 1.15 శాతం, మెటల్ ఇండెక్స్ 1.10 శాతం, పవర్ 0.86 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.52 శాతం, టెలికాం 0.47 శాతం లాభపడగా.. కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.88 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.54 శాతం, రియాలిటీ 0.52 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.36 శాతం నష్టపోయాయి.

 అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,153 కంపెనీలు లాభపడగా 2,050 స్టాక్స్ నష్టపోయాయి. 182 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 143 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 40 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్ లాభపడగా.. 22 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా 1.66 శాతం, ఎటర్నల్ 0.99 శాతం, మారుతి 0.55 శాతం, అదానీపోర్ట్స్ 0.44 శాతం, హెచ్యూఎల్ 0.39 శాతం లాభపడ్డాయి. అలాగే ఎయిర్‌టెల్ 1.51 శాతం, ట్రెంట్ 1.42 శాతం, టీసీఎస్ 1.35 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.25 శాతం, టైటాన్ 1.14 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Shamirpet Tahsildar Bribe | రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *