Maruti Car Sales | ‘మారుతి’ సరికొత్త చరిత్ర.. మేలో వాహన విక్రయాలు అదుర్స్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maruti Car Sales | ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ ఇండియా కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మే నెలకు సంబంధించి విడుదలైన కార్ల విక్రయాల డేటా దీనిని స్పష్టం చేస్తోంది.

వార్షిక ప్రాతిపదికన మారుతి కార్ల విక్రయాలు 34.76 శాతం పెరిగి 2,42,688 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది మే నెలలో కార్ల విక్రయాలు 1,80,077 గా ఉన్నాయి. అంతే వార్షిక ప్రాతిపదికన 34.76 శాతం వృద్ధి నమోదయ్యింది. ఒక నెలలో ఈస్థాయిలో కార్ల విక్రయాలు నమోదవడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు.

Maruti Car Sales | ప్యాసింజర్ కార్ల అమ్మకాలు..

Maruti Car Sales

మారుతి సుజుకీ (Maruti Suzuki) మొత్తం ప్యాసింజర్ కార్ల విక్రయాలు మే నెలలో 97,830 యూనిట్లుగా ఉన్నాయి. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు నెలల్లో కార్ల విక్రయాలు 4,82,334 యూనిట్లుగా నమోదయ్యాయి. రెండు నెలల్లో ఈస్థాయిలో అమ్మకాలు నమోదవడమÖ రికార్డేనని కంపెనీ చెబుతోంది.

Maruti Car Sales | దేశీయంగా..

దేశీయంగా కార్ల విక్రయాలు కూడా పెరిగాయి. మే నెలలో 1,93,535 యూనిట్లతో జీవన కాల గరిష్టాలను తాకాయి. అంతకుముందు ఏడాది మేలో దేశీయంగా కార్ల విక్రయాల సంఖ్య 1,38,690 యూనిట్లుగా ఉంది.
ఎగుమతులు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది మేలో 31,219 యూనిట్ల కార్లను ఎగుమతి చేయగా.. ఈ ఏడాది మేలో 41,914 యూనిట్లకు పెరిగాయి.

Maruti Car Sales | విభాగాల వారీగా అమ్మకాలు..

Maruti Car Sales

చిన్న కార్లు లేదా ఎంట్రీ లెవెల్ కార్ల విషయానికి వస్తే ఆల్టో, ఎస్ ప్రెస్సో వంటి మోడల్ కార్ల విక్రయాలు మే నెలలో 16,275 యూనిట్లుగా నమోదయ్యాయి.

కాంపాక్ట్ కార్ల విషయానికి వస్తే బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ మోడళ్లన్నీ కలిపి 81,555 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 మే నెలలో ఇది కేవలం 61,960 యూనిట్లుగానే ఉంది.

యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో బ్రెజ్జా, ఎర్టిగా, ఇ- విటారా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విటారా, ఎక్స్ ఎల్ 6 వంటి వాటి యూనిట్ల విక్రయాలు 79,267 యూనిట్లకు చేరాయి.

2026 మే నెలలో ఈకో వ్యాన్స్ అమ్మకాలు 13,240 యూనిట్లుగా ఉన్నాయి.

లైట్ కమర్షియల్ వెహికిల్స్ 3,198 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Maruti Car Sales | సీఎన్జీ వాహనాలపై మారుతీ దృష్టి

సీఎన్జీ వాహనాల ఉత్పత్తి పెంపుపై మారుతి సుజుకీ ఇండియా దృష్టి సారించింది. మే 11 నుంచి మారుతి సీఎన్జీ వేరియంట్లకు బుకింగ్‌లు 40 శాతం పెరిగాయని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారు. మే నెలలో రికార్డు స్థాయిలో 78 వేల సీఎన్జీ వాహనాలను డీలర్లకు అందించామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: June 02 Gold Rates | రికార్డు స్థాయిలోనే బంగారం, వెండి ధరలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *