Stock Market Losses | నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | అమెరికా -ఇరాన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి, ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం, రూపాయి విలువలో బలహీనతతో మన మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

ఆర్బీఐ మÖడు రోజుల మానిటరింగ్ పాలసీ కమిటీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్న మదుపరులు.. కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తుండడంతో మార్కెట్లు రేంజ్ బౌండ్‌లో కొనసాగుతున్నాయి.

Stock Market Losses | గ్యాప్ డౌన్‌లో ప్రారంభం..

Stock Market Losses

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 322 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 130 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 345 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 153 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 147 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో 74,215 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 23,339 వద్ద ఉన్నాయి.

Stock Market Losses | ఐటీ సెక్టార్‌లో జోరు..

ఐటీ సెక్టార్‌లో జోరు కొనసాగుతోంది. నిఫ్టీ (Nifty) ఐటీ సూచీ 4.66 శాతం, మెటల్ 0.34 శాతం లాభాలతో ఉండగా.. యుటిలిటీ 1.60 శాతం, పవర్ 1.52 శాతం, ఫార్మా 1.26 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.77 శాతం, మీడియా 0.71 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.68 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.56 శాతం, ఎనర్జీ 0.55 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

Stock Market Losses

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో, 17 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ 6.42 శాతం, ఇన్ఫోసిస్ 5.86 శాతం, హెచ్సీఎల్ టెక్ 4.10 శాతం, టెక్ మహీంద్రా 2.48 శాతం, టాటా స్టీల్ 0.50 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎన్టీపీసీ 3.51 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.06 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.81 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.67 శాతం, ఎల్ టీ 1.61 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Maruti Car Sales | ‘మారుతి’ సరికొత్త చరిత్ర.. మేలో వాహన విక్రయాలు అదుర్స్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *