Adani Power Q2 Results | అదానీ పవర్ దూకుడు.. ఏకంగా 134 శాతం పెరిగిన లాభాలు

అదానీ పవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో కళ్లు చెదిరే ఫలితాలను ప్రకటించింది. లాభాలు ఏకంగా 134 శాతం పెరగడం గమనార్హం.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Adani Power Q2 Results | దేశంలో కరెంట్ డిమాండ్ పెరగడంతో అదానీ పవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయాలలో గణనీయమైన పెరుగుదలను నివేదించింది. 2026 -27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం గతేడాది ఇదే కాలంతో పోల్చితే 134 శాతం పెరిగింది. రూ. 2,953 కోట్ల నుంచి రూ. 6,919 కోట్లకు చేరింది.కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఆదాయం సైతం 45 శాతం ఎగబాకి రూ. 19,439 కోట్లుగా రికార్డయ్యింది. ఇది అంతకుముందు సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ. 13,457 కోట్లు.

Adani Power Q2 Results | పెరిగిన అమ్మకాలు..

బలమైన విద్యుత్ డిమాండ్, అధిక అమ్మకపు ధరల మద్దతుతో ఈ త్రైమాసికంలో సమీకృత విద్యుత్ అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ త్రైమాసికంలో అదానీ (Adani) పవర్ మొత్తం 26.4 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. 2025 -26 సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 23.7 బిలియన్ యూనిట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధి వేగవంతం కావడం, రుతుపవనాల మందగమనం వల్ల విద్యుత్ కొరత ఏర్పడడం వంటి కారణాలతో అదానీ పవర్ అమ్మకాలు భారీగా పెరిగాయని భావిస్తున్నారు.

Adani Power Q2 Results | ఖర్చులు..

అధిక అమ్మకాల పరిమాణం, దిగుమతి చేసుకున్న బొగ్గు ల్యాండెడ్ కాస్ట్‌లో 50 శాతం పెరుగుదల కారణంగా ఇంధన వ్యయాలు 41.8 శాతం పెరిగి రూ.7,216.23 కోట్ల నుంచి రూ. 10,229.38 కోట్లకు చేరాయి. కాగా బలమైన నిర్వహణ నగదు ప్రవాహం, నిర్వహణ రుణాన్ని నియంత్రితంగా ఉపయోగించడం వల్ల ఆర్థిక వ్యయాలు 9.7 శాతం తగ్గి రూ. 841.63 కోట్ల నుంచి రూ.760.23 కోట్లకు పడిపోయాయి.

Adani Power Q2 Results | ఈబీఐటీడీఏ 60 శాతం అప్..

కంపెనీ నిర్వహణ లాభం (ఈబీఐటీడీఏ) 60 శాతం పెరిగి రూ. 8,231 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్లు 38.3 శాతం నుంచి ఏకంగా 42.3 శాతానికి పెరిగాయి. ఇది 435 బేసిస్ పాయింట్లు పెరగడం గమనార్హం.

Adani Power Q2 Results | పెరుగుతున్న డిమాండ్..

బలహీనమైన రుతుపవనాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే 11.5 శాతం పెరిగి 502 బిలియన్ యÖనిట్లకు చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి 11 శాతం పెరిగి 536 బిలియన్ యÖనిట్లకు చేరగా, జలవిద్యుత్ లభ్యత తగ్గడం వల్ల బొగ్గు మరియు లిగ్నైట్ ఆధారిత ఉత్పత్తి వాటా పెరిగింది. బొగ్గు మరియు లిగ్నైట్ ఆధారిత ప్లాంట్లు విద్యుత్ సరఫరాలో 66శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది ఏడాది క్రితం 65 శాతంగా ఉంది. బొగ్గు ప్లాంట్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ కూడా 62 శాతం నుంచి 68 శాతానికి పెరిగింది.

Adani Power Q2 Results | భారీ విస్తరణ ప్రణాళికలు..

భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదానీ పవర్ థర్మల్ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. ఏకంగా 23,720 మెగావాట్ల అదనపు థర్మల్ పవర్ సామర్థ్యాన్ని జోడించేందుకు ప్రయత్నిస్తోంది. 1,320 మెగావాట్ల కోర్బా ఫేజ్-2 సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, 1,600 మెగావాట్ల మహాన్ ఫేజ్-2 అల్ట్రా సూపర్‌క్రిటికల్ ప్రాజెక్ట్ ఎఫ్ వై 28 తొలినాళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కోర్బా ఫేజ్-2లోని మొదటి 660 మెగావాట్ల యూనిట్ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించబడింది, త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, రాయ్‌గఢ్ ప్రాజెక్టులు సైతం 30 నెలల్లోనే 65 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇతర ప్రాజెక్టులూ పురోగతిలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: SFC Environmental IPO | ఐపీవోకు వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. మంగళవారం నుంచి అందుబాటులోకి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *