అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uppal Bus Terminal | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిటీ బస్ టెర్మినల్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
రోజుకు సుమారు లక్ష మంది ప్రయాణికులకు సేవలందించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ బస్ టెర్మినల్ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటి వరకు 367 కోట్ల ప్రయాణాలు నమోదైనట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తామన్నారు.
Uppal Bus Terminal | కొత్త బస్సుల కొనుగోలు
ఆర్టీసీకి ఇప్పటికే 3,000కు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రానున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Cold Wave | నేటి నుంచి పెరగనున్న చలితీవ్రత