అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Global Gateway | తెలంగాణ (Telangana)ను భారత్‌కే కాదు గ్లోబల్ గేట్వేగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ 2047 తీసుకొచ్చినట్లు తెలిపారు. 2034 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ముందుగా అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము పాలకులం కాదని, ప్రజల సేవకులం అని పేర్కొన్నారు. ‘‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అన్న కాళోజీ మాటల స్ఫూర్తి అని తెలిపారు. ప్రతి క్షణం తెలంగాణ ప్రజల హితమే పరమార్థంగా భావించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
Telangana Global Gateway | విద్యాశాఖలో మార్పులు
తాము అధికారంలోకి వచ్చాక విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం (CM Revanth Reddy) తెలిపారు. కేంద్రం ఇచ్చిన పెర్ఫామెన్స్ గ్రేడింగ్‌లో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని చెప్పారు. విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశామన్నారు.
Telangana Global Gateway | పేదలకు సన్న బియ్యం
పేదలకు ఆహార భద్రత కల్పించే విధంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని రేవంత్‌రెడ్డి వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ 3 కోట్ల 38 వేలమందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికి సమాన అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Telangana Global Gateway | అన్ని రకాల పంటలు పండించాలి
రాష్ట్రంలో 2.36 కోట్ల టన్నుల పంట దిగుబడులు రావడం గర్వకారణం అని సీఎం అన్నారు. రైతులు (Farmers) కొన్ని పంటలకే పరిమితం కాకుండా, అన్ని రకాల కూరగాయలు పండించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీపడే పరిస్థితి లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Formation Day | అమరవీరులకు సీఎం – టీపీసీసీ చీఫ్ నివాళి


