Sensex Nifty Fall | నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. సెన్సెక్స్ 352 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sensex Nifty Fall | దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం సైతం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, సౌదీపై హూతీల దాడులతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లు దాటింది. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనతో ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

Sensex Nifty Fall | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా మొదట్లో కోలుకుని 163 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి 713 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 13 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 194 పాయింట్లు నష్టపోయింది. అయితే కనిష్టాల వద్ద విలువ ఆధారిత కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 352 పాయింట్ల నష్టంతో 73,246 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 22,698 వద్ద స్థిరపడ్డాయి.

Sensex Nifty Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,245 కంపెనీలు లాభపడగా 2,079 స్టాక్స్ నష్టపోయాయి. 231 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 81 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 222 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో, 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎల్టీ 3.68 శాతం, ట్రెంట్ 2.79 శాతం, ఎస్బీఐ 1.23 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.14 శాతం, ఇండిగో 1.13 శాతం లాభపడ్డాయి.

Top Losers : రిలయన్స్ 3.46 శాతం, ఇన్ఫోసిస్ 3.34 శాతం, టెక్ మహీంద్రా 1.83 శాతం, టీసీఎస్ 1.68 శాతం, ఎయిర్‌టెల్ 1.42 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Crude Oil Prices | తగ్గని చమురు ధరలు.. నష్టాల్లో ప్రధాన సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *