అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra FDA | మహారాష్ట్ర ఎఫ్డీఏకు బాంబే హైకోర్టు (Bombay High Court) షాక్ ఇచ్చింది. ఓ స్వీట్ షాపు లైసెన్స్ నిలిపివేసినందుకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఆహారశాలలు, హోటళ్ల లైసెన్సులను నిలిపివేస్తూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) జారీ చేసిన ఉత్తర్వు విచిత్రమైన, విపరీతమైన విధానం అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఫుడ్ పాయిజనింగ్ ఫిర్యాదు నేపథ్యంలో జూన్ 12న ఎఫ్డీఏకు చెందిన ఒక ఆహార భద్రతా అధికారి పూణేలోని గురునానక్ డైరీ అండ్ స్వీట్స్ దుకాణాన్ని తనిఖీ చేశారు. పారిశుధ్యం, సిబ్బంది పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ దుకాణం లైసెన్సును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
Maharashtra FDA | హైకోర్టులో సవాల్
ఎఫ్డీఏ నిర్ణయంపై దుకాణ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. జూన్లో మూసివేసినప్పటి నుండి తాము రూ. 8.74 లక్షల ఆదాయం కోల్పోయామని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షాపును తిరిగి వ్యాపారం చేసుకునేందుకు అనుమతిస్తూనే, నెలలోగా యజమానులకు రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Maharashtra FDA | హద్దులు దాటుతున్నారు
ఎఫ్డీఏ చర్యలపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ ఉద్దేశం ప్రశంసనీయమైనదని, కనీసం ఏదో ఒక శాఖ అయినా ముందుకు వచ్చిందని మేము గమనించాం. కానీ మీరు హద్దులు దాటుతున్నారు. (పునఃపరిశీలన నివేదికలో) 98 శాతం నిబంధనల పాటింపును గమనించిన వెంటనే మీరు లైసెన్సు సస్పెన్షన్ను తక్షణమే రద్దు చేయాల్సింది అని ధర్మాసనం పేర్కొంది. జూలై 13న పునఃపరిశీలన నిర్వహించగా, దుకాణం 98 శాతం నిబంధనల పాటింపుతో ఉన్నట్లు తేలింది, కానీ లైసెన్సును పునరుద్ధరించలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి..: Ayodhya Ram Mandir SIT | అయోధ్య విరాళాల కేసులో కీలక పరిణామం.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్చిట్