అక్షరటుడే, గాంధారి: Gandhari BRS Protest | మండల కేంద్రంలోని బాన్సువాడ – కామారెడ్డి (Kamareddy) ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Gandhari BRS Protest | ఆ పథకాలను నిలిపివేయొద్దు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల లింగంపేటలో ధర్నా చేస్తామని పిలుపునివ్వడంతో ఆయనను కామారెడ్డిలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధారి మండలంలో ధర్నాకు దిగారు. దీంతో గంటసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Jajala House Arrest | కామారెడ్డిలో ఉద్రిక్తత.. జాజాల హౌస్ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం