అక్షరటుడే, ఆర్మూర్ : Bore Mechanic Electrocution | పంటపొలంలో బోరు రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో(Electrocution Accident) మెకానిక్ మృతి చెందాడు. ఈ ఘటన ఆర్మూర్(Armoor) మున్సిపల్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
Bore Mechanic Electrocution | పొలంలో..
ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌లోని పెర్కిట్‌కు చెందిన పన్నీరు శ్రీనివాస్ (45) వృత్తిరీత్యా బోర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం అల్లూరి నాగరాజు పొలంలో ఉన్న బోరు మోటారు రిపేరు చేయడానికి వెళ్లాడు. మోటారు స్టార్టర్ డబ్బా రిపేర్ చేస్తుండగా సర్వీస్ వైర్ నుండి అనుకోకుండా కరెంట్ షాక్ తగిలింది. అదే సమయంలో పక్కనే ఉన్న నాగభూషణం అనే వ్యక్తి వెంటనే స్పందించి కర్రతో కొట్టి శ్రీనివాస్‌ను కరెంట్ నుండి వేరు చేశాడు. వెంటనే ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యలు పరీక్షించి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.