అక్షరటుడే, వెబ్‌డెస్క్: Janwada Farmhouse | రంగారెడ్డి జిల్లా (Rangareddy District) జన్వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నివాసం ఉంటున్న ఫామ్‌హౌస్ వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు.
ప్రజా భవన్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు బస్సుల్లో జన్వాడకు వెళ్లారు. అక్కడ భూములను పరిశీలించారు. కేటీఆర్ ఫాంహౌస్ దగ్గర భూములను పరిశీలించి లెక్కలు తేలుస్తామని నాయకులు అన్నారు. కాగా కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. జన్వాడకు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
Janwada Farmhouse | భారీగా బందోబస్తు
జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు అక్కడకు చేరుకొని భూములను పరిశీలించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి హైడ్రా కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. జన్వాడ ఫాంహౌస్‌కు ఏ నోటీసులు ఇచ్చారనే దానిపై వివరాలు అడిగారు. ఫాంహౌస్ అక్రమాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Janwada Farmhouse | ఆ ఫామ్‌హౌస్ నాదే..
కాగా జన్వాడ ఫామ్‌హౌస్ తనదేనని ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి వెల్లడించారు. కేటీఆర్‌కు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కేటీఆర్ చిన్ననాటి మిత్రులం అని చెప్పారు. కాంగ్రెస్ నేతల పర్యటన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తన సొంత ప్రాపర్టీ అయిన జన్వాడ ఫామ్‌హౌస్‌ను కేటీఆర్‌కు లీజ్‌కు ఇచ్చాననని తెలిపారు. ఈ భూములకు లీగల్‌గా క్లియర్ టైటిల్ ఉందనీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: TPCC Chief Mahesh Goud | ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్