అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: AI Technology for Youth | యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. నగరంలోని ఐటీ టవర్స్‌లో శనివారం ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ (NN AI Solutions) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎన్ హ్యాకథాన్–2026 (Nizamabad Hackathon) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
AI Technology for Youth | ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకం..
హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు, యువత, టెక్నాలజీ నిపుణులతో సీపీ ముచ్చటిస్తూ వారు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు మరియు సమస్యల పరిష్కార విధానాలను పరిశీలించారు. ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కీలకంగా మారుతోందని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వివిధ సామాజిక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని సీపీ అన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకత, ఆలోచనా శక్తి, సాంకేతిక నైపుణ్యాలను సరైన దిశలో వినియోగిస్తే సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
AI Technology for Youth | యువతకు ఉపయోగపడే కార్యక్రమాలివి..
‘కోడ్ ఫర్ ఛేంజ్’ (Code for Change) వంటి కార్యక్రమాలు యువతను సాంకేతిక రంగంలో మరింత ప్రోత్సహించడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే వినూత్న పరిష్కారాలను రూపొందించేందుకు వేదికగా నిలుస్తాయని సీపీ తెలిపారు. పోలీసింగ్ వ్యవస్థలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, డేటా విశ్లేషణ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే దిశగా సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. యువత కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడమే కాకుండా, దానిని ప్రజా ప్రయోజనం, సమాజ శ్రేయస్సు మరియు దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
AI Technology for Youth | రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
యువత రోడ్డు భద్రత నియమావళిని తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. 2025లో రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లా వ్యాప్తంగా 327 మంది మరణించారని అదే కోవిడ్ సమయంలో 200 మంది చనిపోయారని గుర్తు చేశారు. యువత అనుక్షణం సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డ్రగ్స్ నియంత్రణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా హ్యాకథాన్‌లో పాల్గొన్న యువత, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ఇచ్చి అభినందించారు. కార్యక్రమంలో ఎన్ఎన్ సొల్యూషన్స్ సీఈవో నజీబ్, మేనేజర్ షేక్ సబ్బార్, కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్, సుభాష్ గార్డెన్ శ్రీనివాస్, ఎన్ఎన్ ఏఐ సొల్యూషన్స్ ప్రతినిధులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: చక్కెర ధరలకు కళ్లెం వేసేలా కేంద్రం కీలక నిర్ణయం