Fertilizer Stocks | ఎరువుల కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్ స్పష్టీకరణ

జిల్లాలో ఎరువుల కొరత లేదని.. రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్​ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ మేరకు ఎడపల్లి, జానకంపేట్​లలో మంగళవారం ఎరువులు గిడ్డంగులను, విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Fertilizer Stocks | జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లు, సేల్ పాయింట్లలో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని.. ఆందోళన చెందవద్దని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ (janakampet), ఎడపల్లిలో (Yedapally) ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు.

Fertilizer Stocks | ఎరువుల నిల్వలపై ఆరా..

గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను (Fertilizer Distribution) కలెక్టర్​ పరిశీలించారు. స్టాక్, రిజిస్టర్​లో పొందుపర్చిన వివరాలతో సరిపోల్చుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని ఎరువుల బస్తాలు వచ్చాయి.. ఎన్ని పంపిణీ చేశారు.. ఎంత పంపిణీ చేయాల్సి ఉందనే వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపి, యాప్ వల్ల సమకూరే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. మన రాష్ట్రంలో అమలు అవుతున్న బుకింగ్ యాప్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఎరువుల పంపిణీ కోసం అమలు చేస్తున్నాయన్నారు. ఈ యాప్ వల్ల ఎలాంటి నష్టం లేదని, గత రబీ సీజన్​లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

Fertilizer Stocks | ఎరువుల బుకింగ్​ యాప్​తో లాభాలెన్నో..

ఎరువులు పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా యూరియా పంపిణీకి బుకింగ్ యాప్ దోహదపడుతుందని, దీని విషయంలో రైతులు అపోహలకు గురి కావద్దని కలెక్టర్​ సూచించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రయోగాత్మకంగా కొంత పరిమాణంలో నానో యూరియాను వినియోగించి ఫలితాలను స్వయంగా పరిశీలించాలని రైతులకు హితవు పలికారు. అయితే రైతులను నానో యూరియా కొనాలని బలవంతం చేయవద్దని, వారు కోరిన ఎరువులు మాత్రమే అందించాలన్నారు. ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Fertilizer Stocks | 27వేల మెట్రిక్​ టన్నులు

జిల్లా రైతుల అవసరాలకు సరిపడా ప్రస్తుతం 27 వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని పాలనాధికారి పేర్కొన్నారు. ఎక్కడ కూడా కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామని తెలిపారు. పలు సొసైటీలు డిఫాల్ట్​లో ఉండగా, వాటి పరిధిలోని రైతులకు సైతం ఇబ్బందులు తలెత్తకూడదని, స్థానికంగానే వారికి ఎరువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో డీసీఎంఎస్ ద్వారా ఎరువుల పంపిణీ జరిపిస్తున్నామన్నారు.

Fertilizer Stocks | ముందుగా విత్తుకునే బోధన్​ తదితర ప్రాంతాల్లో..

పంటలు విత్తుకునే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను (Telangana Agriculture) ప్రారంభించినట్లు కలెక్టర్​ పేర్కొన్నారు. తదుపరి నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా పక్కాగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని, స్టాక్ పాయింట్లకు ఎరువుల నిల్వలు చేరవేశామని వివరించారు. మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ దత్తాద్రి, జానకంపేట్ సర్పంచ్ అనురాధ, సొసైటీ ఛైర్మన్ నరేందర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

oll22

ఇది కూడా చదవండి: Mohan Naik ACB Raid | ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *