Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. నవంబర్​ దర్శన కోటా విడుదల ఎప్పుడంటే?

శ్రీవారి దర్శనం, సేవలకు సంబంధించిన నవంబర్​ కోటా విడుదల తేదీలను టీటీడీ అధికారులు వెల్లడించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala Darshan | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఏడు కొండలపైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల కోసం టీటీడీ ఆన్​లైన్​లో దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది. తాజాగా నవంబర్​ కోటాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి ఇతర టికెట్ల నవంబర్​ కోటా ఆన్లైన్ బుకింగ్ తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ నెల 18న ఆర్జిత సేవలకు ఎలక్ట్రానిక్​ డిప్​ ప్రారంభం అవుతుంది. 20 వ తేది ఉదయం 10 గంటలకు వరకు రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఆన్​లైన్​లో విడుదల చేస్తారు.

Tirumala Darshan | నవంబర్​ 16న పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు యాగం సేవా టికెట్ల బుకింగ్స్​ ప్రారంభం అవుతుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవల (వర్చువల్ పాల్గొనడం) టికెట్లు ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్​ చేసుకోవచ్చు. నవంబర్​ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 24 ఉదయం 10 గంటల నుండి బుకింగ్ ప్రారంభం అవుతుంది. వయోవృద్ధులు / దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా కోసం అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్​ చేసుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను ఈ నెల 25న ఆన్​లైన్​లో విడుదల చేస్తారు.

ఇది కూడా చదవండి..: Amaravati farmers sacrifice | అమరావతి రైతుల త్యాగం ప్రపంచానికే ఒక గొప్ప స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *