అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Road Accident |హైదరాబాద్-నిజామాబాద్ (Nizamabad) జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. రామారెడ్డి బ్రిడ్జి వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Kamareddy Road Accident |హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా..
హైదరాబాద్ నుంచి నిర్మల్ (Nirmal) వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే కామారెడ్డి జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడవి తండాకు చెందిన బాలాజీ, పారుబాయ్, ఆమె కుమారుడు రాజేష్, సారంగపూర్‌కు చెందిన ఆశిస్, ఆయన భార్య ప్రతిభ, వారి రెండేళ్ల కుమార్తె శివాన్సీ కారులో ప్రయాణిస్తున్నారు. రామారెడ్డి బ్రిడ్జి వద్ద ముందు కారు ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Suryapet Bus Stand | “పురుషులను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం”..సూర్యాపేట బస్టాండులో వెలిసిన వింత బోర్డు!