Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శనివారం జరగనుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Smart Ration Cards | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శనివారం జరగనుంది. దీనికి సంబంధించి జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్​లో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Smart Ration Cards | మధ్యాహ్నం 2గంటల నుంచి..

ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్​ను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రేషన్ కార్డులు కలిగి ఉన్న లబ్దిదారులు, రేషన్ డీలర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Smart Ration Cards | అన్ని శాఖలు సమన్వయంతో..

పేద కుటుంబాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ వసతి ఉండాలని, వేదిక, సీటింగ్ అరేంజ్​మెంట్, సౌండ్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లను పక్కాగా సరిచూసుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, జిల్లా రెవెన్యూ అధికారి గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్, డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీవో సాయన్న, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Independence Day | కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *