Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగి నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 171 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు పడిపోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | అమెరికా-ఇరాన్‌ల మధ్య కొనసాగతున్న ఘర్షణ, పెరుగుతున్న బాండ్ దిగుబడులపై ఆందోళనలతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బలహీనమైన ఆసియా మార్కెట్లను అనుసరించి భారతీయ ఈక్విటీలు సైతం రోజంతా నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. లార్జ్ క్యాప్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

Stock Market Losses | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 89 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 160 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 588 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో మొదలై మరో 28 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 169 పాయింట్లు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 171 పాయింట్ల నష్టంతో 77,369 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 24,219 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,039 కంపెనీలు లాభపడగా 2,400 స్టాక్స్ నష్టపోయాయి. 249 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 187 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 122 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్ లాభపడగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా స్టీల్ 1.86 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.30 శాతం, ఇన్ఫోసిస్ 0.89 శాతం, హెచ్యూఎల్ 0.50 శాతం, సన్‌ఫార్మా 0.47 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఆదానీపోర్ట్స్ 1.30 శాతం, బీఈఎల్ 1.27 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.26 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.22 శాతం, ట్రెంట్ 0.87 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Lalitha Jewellery IPO | ఐపీవోతో డబ్బులొచ్చాయ్!.. భారీ లాభాలను అందించిన లలితా జువెలరీ మార్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *