Kavitha Criticism | కమిటీల పేరుతో కాలయాపన.. ప్రభుత్వంపై కవిత విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోందని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత అన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Criticism | కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోందని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఉద్యమకారుల విషయమైన ఉద్యోగుల విషయమైన సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వం 317 జీవోపై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఆ జీవోను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తెచ్చిందని కవిత గుర్తు చేశారు. తొమ్మిది నెలలు గడిచిన సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. వారిని స్వస్థలాకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం చెప్పిందన్నారు.

Kavitha Criticism | బదిలీలు చేయాలి

జీవో గడువు మూడేళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా బదిలీ చేయలేదని కవిత అన్నారు. జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలని డిమాండ్​ చేశారు. అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నారు. ఉద్యోగులు, టీచర్ల హక్కుల కోసం వారి తరఫున పోరాడుతామని పేర్కొన్నారు. ఉద్యోగులను బదిలీ చేయకుండా పైరవీల కోసం ప్రభుత్వం ఆగుతుందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయంలో పోరాడాలన్నారు. తాము ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 317 జీవోల బాధితులను తక్షణమే బదిలీ చేయాలన్నారు.

ఇది కూడా చదవండి..: Loan Money Fraud | కొత్తూరులో సైబర్ మోసం.. రూ. 16.78 లక్షలు మాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *