Telangana Minimum Wages | కార్మికులకు సీఎం గుడ్​న్యూస్​.. కనీస వేతనాలు పెంపు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Minimum Wages | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణలోని కార్మికులకు గుడ్​ న్యూస్​ చెపపారు. వారి కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కార్మికులను నాలుగు విభాగాలుగా విభజించినట్లు తెలిపారు. అన్‌స్కిల్డ్‌ కార్మికులకు కనీస వేతనం రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సెమీ స్కిల్డ్‌ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు, స్కిల్డ్‌ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో 1.21 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

Telangana Minimum Wages | జూన్​ 1 నుంచి అమలులోకి..

కార్మికుల కనీస వేతనాలు పెంపు జూన్​ 1 నుంచి అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కార్మిక నాయకుడు అంటే కాక అని గుర్తు చేశారు. ఆయన కుమారుడు వివేక్​ నేడు కార్మిక శాఖ మంత్రిగా ఉండటం గర్వకారణమన్నారు.

Telangana Minimum Wages | ధాన్యం కొనుగోళ్లపై..

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం మాట్లాడారు. ఇంకా 20శాతం ధాన్యం మాత్రమే కొనాల్సి ఉందన్ఆనరు. మిగతా అంత కొనుగోలు చేశామని చెప్పారు. 72 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. బెంగాల్​లో ఎన్నికలు ఉండటంతో హమాలీలు ఆలస్యంగా వచ్చారని చెప్పారు. దీంతో కొనుగోళ్లలో జాప్యం జరిగిందన్నారు. బీఆర్​ఎస్​ శవ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై లెక్క తేలుద్దాం అని సవాల్​ చేశారు.

ఇది కూడా చదవండి..: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ.. 23న జరిగే కేబినెట్ మీటింగ్‌పై కీలక డిమాండ్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *