ఆంధ్రప్రదేశ్​Balineni Comments on Jagan | బటన్లు నొక్కారు తప్ప చేసిందేం లేదు.. జగన్‌పై బాలినేని...

Balineni Comments on Jagan | బటన్లు నొక్కారు తప్ప చేసిందేం లేదు.. జగన్‌పై బాలినేని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవర్తనపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ కేవలం బటన్లు నొక్కడానికే పరిమితమయ్యారని, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balineni Comments on Jagan | వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవర్తనపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) తీవ్రంగా మండిపడ్డారు. జగన్ కేవలం బటన్లు నొక్కడానికే పరిమితమయ్యారని, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. జగన్ తీసుకున్న మొండి నిర్ణయాల వల్లే గత ఎన్నికల్లో తాను ఓడిపోవాల్సి వచ్చిందని, తన ఓటమికి ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

Balineni Comments on Jagan | రాజధానిపై నాడే హెచ్చరించా..

రాజధాని ఏర్పాటు విషయంలో జగన్‌తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తాను ముందే సలహాలు ఇచ్చానని బాలినేని గుర్తుచేశారు. నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో రాజధానిని నిర్మిస్తే బాగుంటుందని ఆనాడే చెప్పినప్పటికీ.. జగన్ తన మాటను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీసుకున్న ఇష్టారాజ్య నిర్ణయాల వల్ల రాష్ట్రంతో పాటు పార్టీ కూడా భారీగా నష్టపోయిందని ఆరోపించారు.

Balineni Comments on Jagan | జగన్ వైఫల్యాల వల్లే నష్టం..

వైసీపీని సరైన దారిలో నడపడం జగన్‌కు చేతకావడం లేదని బాలినేని విమర్శించారు. ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ, రాష్ట్రం దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌లోని నాయకత్వ లోపాలు, ఆయన ఒంటెద్దు పోకడల కారణంగానే అటు నాయకులు, ఇటు ప్రజలు ఆయనకు దూరమయ్యారని బాలినేని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Telangana Minimum Wages | కార్మికులకు సీఎం గుడ్​న్యూస్​.. కనీస వేతనాలు పెంపు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

FBI Scam Network|అమెరికా వృద్ధులకు భారత్ స్కామర్ల టోకరా.. గుట్టురట్టు చేసిన FBI

అక్షరటుడే వెబ్‌డెస్క్:FBI Scam Network|అమెరికాలోని వృద్ధులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల...

Armoor Municipal Meeting | సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్​ పార్టీ కౌన్సిలర్ల డుమ్మా.. ప్రత్యేక భేటీపై సర్వత్రా చర్చ!

అక్షరటుడే,ఆర్మూర్: Armoor Municipal Meeting | ఆర్మూర్ మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె...

Tata Tiago Facelift | మధ్య తరగతి కోసం మరో కారు.. మే 28న లాంచ్ చేయనున్న టాటా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Tiago Facelift | దేశీయ ఆటోమొబైల్ రంగ...