Indian Truck Drivers Arrested | అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్‌ డ్రైవర్ల అరెస్టు..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Truck Drivers Arrested | అమెరికా (America)లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ట్రక్​ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను తాజాగా అరెస్ట్ చేశారు.

దేశంలో అక్రమంగా నివసిస్తున్నందుకు 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. సోమవారం యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మే 11-15 తేదీల మధ్య అరిజోనాలోని యూమా సెక్టార్ ఏజెంట్లు అరెస్టు చేసిన 52 మందిలో ఈ భారతీయులు (Indians) కూడా ఉన్నారు. వీరందరినీ దేశ బహిష్కరణకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 52 మందిని అరెస్టు చేయగా, వారిలో 36 మంది సెమీ-ట్రక్కులు నడిపారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, ముగ్గురి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం గమనార్హం.

Indian Truck Drivers Arrested | స్వదేశానికి పంపేందుకు చర్యలు

Indian Truck Drivers Arrested

అరెస్ట్ అయిన వారిలో 30 మంది భారతదేశానికి చెందినవారు కాగా, ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యాకు చెందినవారు ఉన్నారు. వీరందరిపై ఫెడరల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని, దేశ బహిష్కరణ విధించారు. వీరిని త్వరలో స్వదేశాలకు పంపనున్నారు. కాగా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వాణిజ్య మోటారు వాహన ఆపరేటర్లను గుర్తించి, అరెస్టు చేసేందుకు అమెరికా అధికారులు ‘ఆపరేషన్ చెక్‌మేట్’ నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: US Shooting Incident | అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *