IIRF Rankings 2026 | ఐఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్.. టాప్​ 5లో హైదరాబాద్​ యూనివర్సిటీ

ఐఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం దేశంలోని టాప్-10 కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: IIRF Rankings 2026 | ఐఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం దేశంలోని టాప్-10 కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం (University of Hyderabad) చోటు దక్కించుకుంది. దేశంలోని యూనివర్సిటీల్లో సౌకర్యాలు, బోధన, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్స్​ విడుదల చేస్తారు.

ఈ జాబితాలో ఢిల్లీలోని జేఎన్​యూ మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో హైదరాబాద్​ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది. కాశీలోని బనారస్​ యూనివర్సిటీ ఐదో స్థానంలో నిలిచింది.

IIRF Rankings 2026 | తెలంగాణ నుంచి 3 యూనివర్సిటీలు

ఆంధ్రప్రదేశ్​లోని సెంట్రల్ యూనివర్సిటీ (అనంతపూర్​) 21వ ర్యాంక్​ సాధించింది. హైదరాబాద్​లోని మౌలానా అజాద్​ ఉర్దూ యూనివర్సిటీ 31, ఇఫ్లూ 38 ర్యాంక్​లు సాధించాయి. మొత్తం 50 యూనివర్సిటీలతో జాబితా విడుదల చేయగా తెలంగాణ నుంచి మూడు విశ్వవిద్యాయాలు చోటు దక్కించుకున్నాయి.

ఇది కూడా చదవండి..: Tellapur Lake | కాంక్రిట్​ జంగిల్​లో.. ఆహ్లాదం పంచే చెరువు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *