అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heavy Rain Alert | రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వానాకాలం సీజన్ ప్రారంభం అయిన నాటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడలేదు. అక్కడక్కడ మోస్తరు వానలు పడిన ఉక్కపోత నుంచి ఉపశమనం లభించలేదు. పంటల సాగుకు అవసరమైన మేర భారీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నాలుగు రోజులుగా ఎండలు సైతం మండుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు.
Heavy Rain Alert | ఆ జిల్లాలకు అలర్ట్
దక్షిణ, మధ్య తెలంగాణ (Telangana)ల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట,నల్గొండ, భువనగిరి, జనగామ, కామారెడ్డి అర్ధరాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నగరంలో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి.
ఇది కూడా చదవండి..: Krait snake bite | స్నేక్‌తో ఆటలు: కట్లపాము కాటుకు ఫామ్‌హౌస్ యజమాని బలి!