Sridhar Babu Comments | సభను శాసించడానికి మీరెవరు?.. హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. స

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sridhar Babu Comments | శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. సభను ఎలా నడపాలో స్పీకర్‌ను ఆదేశించడానికి, శాసించడానికి ప్రతిపక్ష నేతలు ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ వ్యవస్థను బెదిరించేలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. సభలో ఏం జరిగిందనేది వీడియోల్లో స్పష్టంగా రికార్డై కనిపిస్తోందని, దీనిపై ఎలాంటి అపోహలకు తావులేదని తేల్చిచెప్పారు.

Sridhar Babu Comments | తగిన చర్యలు తప్పవు..

మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన ఘటనలను ప్రభుత్వం లేదా స్పీకర్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను శ్రీధర్ బాబు పూర్తిగా కొట్టిపారేశారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై ఇప్పటికే పూర్తి నివేదిక ఇవ్వాలని స్పీకర్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. అయితే, ఆ ఘటనను అడ్డుపెట్టుకుని స్పీకర్‌ను నేరుగా అవమానించిన విషయాన్ని మాత్రం పక్కన పెట్టాలని ప్రతిపక్షాలు కోరడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిబట్టారు. ఉన్నతమైన స్పీకర్ వ్యవస్థపై దాడి జరిగిన విషయాన్ని వదిలేయాలని అనడం ఏమాత్రం సమంజసం కాదని, చట్టసభ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Chalo Hyderabad Mahadharna | 10న ఉద్యోగుల ‘చలో హైదరాబాద్​ మహాధర్నా’ను సక్సెస్​ చేయాలి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *