PCB Chairman | పీసీబీ ఛైర్మన్​గా రాజ శేఖర్​ రెడ్డి నియామకం

తెలంగాణ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఛైర్మన్​గా రిటైర్డ్​ ఐఆర్​ఎస్​ అధికారి లక్కడి రాజశేఖర్​రెడ్డి నియమితులయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: PCB Chairman | తెలంగాణ (Telangana) పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఛైర్మన్​గా రిటైర్డ్​ ఐఆర్​ఎస్​ అధికారి లక్కడి రాజశేఖర్​రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎస్​ ఛైర్మన్​, సభ్యులను నియమించారు. పర్యావరణ పరిరక్షణలో రాజా శేఖర్ రెడ్డికి ఉన్న విశేష పరిజ్ఞానం, ఆచరణాత్మక అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆయనను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఛైర్మన్‌గా నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Sridhar Babu Comments | సభను శాసించడానికి మీరెవరు?.. హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *