Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం కళాశాలల పోరుబాట

ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం కళాశాలలు పోరుబాట పట్టాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్:  Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం కళాశాలలు పోరుబాట పట్టాయి. ఈ సందర్భంగా బోధన్​ (Bodhan) పట్టణంలో కళాశాలలను మూసివేసిన యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్ర డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్య ఐక్యవేదిక పిలుపు మేరకు నిరసన తెలిపాయి.

Fee Reimbursement Protest | 2‌‌021 నుంచి పెండింగ్​లో..

2021 నుంచి పెండింగ్​లో ఉన్న బోధనారుసుము బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉషోదయ డిగ్రీ కళాశాలలు బంద్​ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉషోదయ విద్యా సంస్థల ఛైర్మన్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ.. ఆర్​టీఎఫ్​ (RTF) బకాయిలు విడుదల కాకపోవడం మూలంగా జరిగే ఇబ్బందులను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షుణ్ణంగా వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ డిగ్రీ కళాశాల, ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Chalo Hyderabad Mahadharna | 10న ఉద్యోగుల ‘చలో హైదరాబాద్​ మహాధర్నా’ను సక్సెస్​ చేయాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *