Dalit Speaker Remarks | దళిత స్పీకర్​ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలి

దళిత స్పీకర్​ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆలూర్: Dalit Speaker Remarks | దళిత స్పీకర్​ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆలూర్​ మండల (Alur Mandal) కేంద్రంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు దేగాం ప్రమోద్​ ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.

Dalit Speaker Remarks | అసెంబ్లీ సాక్షిగా..

ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్‌ను పరుష పదజాలంతో దూషించడం అత్యంత సిగ్గుచేటని ప్రమోద్​ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు. స్పీకర్‌ను అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లారెడ్డి, బార్ల ముత్యం, తలారి రాకేష్, సమీర్, శేషి, యాదాగౌడ్, ప్రభాకర్, ప్రశాంత్, శ్రీనివాస్ గౌడ్, నవనీత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్​ కోసం కళాశాలల పోరుబాట

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *