అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Poco X8 Power 5G | చైనా (China)కు చెందిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన పోకో.. మిడ్ రేంజ్ లో మరో కొత్త మోడల్ ఫోన్‌ను తీసుకువచ్చింది. పోకో ఎక్స్ 8 పవర్ 5జీ స్మార్ట్ ఫోన్ పేరుతో భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 10,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 11న ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభం కానుంది. స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.83 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1280 X 2772 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐపీ68 /ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.
ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
Poco X8 Power 5G | కెమెరా సెటప్..
వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు.
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
Poco X8 Power 5G | బ్యాటరీ సామర్థ్యం..
10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్.. 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 27డబ్ల్యూ రివర్స్ చార్జింగ్‌కు అవకాశం ఉంది.
రెండు వేరియంట్‌లలో..
బ్లాక్, ఎల్లో కలర్స్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999.
ప్రారంభ ఆఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 2వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాల బాటలో స్టాక్ మార్కెట్