Stock Market Losses | నష్టాల బాటలో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 431 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. టెహ్రాన్‌పై ఏవైనా కొత్త దాడులు జరిగితే అమెరికా ఆస్తులపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలు, అమెరికా (America)కు చెందిన చమురు, గ్యాస్ ప్రయోజనాలు ప్రమాదంలో ఉన్నాయని ఆ దేశం స్పష్టం చేసింది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పెట్టుబడులను ఉపసంహరిస్తుండడంతో మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి.

Stock Market Losses | తగ్గని ముడిచమురు ధరలు..

ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తోంది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 98 డాలర్లు దాటింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

Stock Market Losses | గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 162 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 42 పాయింట్లు పెరిగింది. ఇంట్రాగే గరిష్టాలనుంచి 344 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 15 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేక 101 పాయిట్లు నష్టపోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 431 పాయింట్ల నష్టంతో 75,701 వద్ద, నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో 23,675 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 2.51 శాతం, హెచ్యూఎల్ 0.95 శాతం, అదానీపోర్ట్స్ 0.67 శాతం, ఐటీసీ 0.64 శాతం, ఎటర్నల్ 0.52 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : యాక్సిస్ బ్యాంక్ 1.94 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.76 శాతం, రిలయన్స్ 1.39 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.14 శాతం, మారుతి 1.05 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Sep 08 Gold Market | బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *