Krait snake bite | స్నేక్​తో ఆటలు: కట్లపాము కాటుకు ఫామ్​హౌస్ యజమాని బలి!

భారతదేశంలో అత్యంత విషపూరితమైన నాలుగు ప్రధాన సర్పాలలో (Big Four) కట్లపాము ఒకటి. దీని విషం నేరుగా నరాల వ్యవస్థపై (Neurotoxic) ప్రభావం చూపిస్తుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Krait snake bite | పాములతో చెలగాటం ప్రాణాలకే ముప్పు తెస్తుందని నిరూపించే మరో విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఫామ్​హౌస్‌లోకి దూరిన విషసర్పంతో ఆటలాడిన ఓ వ్యక్తి, అది కాటు వేయడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Krait snake bite | అసలేం జరిగిందంటే..?

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫామ్​హౌస్‌లోకి ప్రమాదకరమైన ‘కట్లపాము’ (Common Krait) చొరబడింది. గమనించిన ఫార్మ్‌హౌస్ యజమాని నవాబ్, స్నేక్ క్యాచర్స్ సహాయం తీసుకోకుండా స్వయంగా రంగంలోకి దిగాడు. అత్యంత చాకచక్యంగా ఆ పామును చేతులతో పట్టుకున్నాడు.

Krait snake bite | ప్రాణం తీసిన అజాగ్రత్త

పామును పట్టుకున్న ఆనందంలో నవాబ్ అజాగ్రత్తగా వ్యవహరించాడు. దానిని సురక్షిత ప్రాంతంలో వదిలేయడం, అధికారులకు అప్పగించడం చేయకుండా.. చేతుల్లో తిప్పుతూ ఆటలాడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో క్షణాల వ్యవధిలో ఆ కట్లపాము నవాబ్ చేతిపై ఘాటుగా కాటు వేసింది.

భారతదేశంలో అత్యంత విషపూరితమైన నాలుగు ప్రధాన సర్పాలలో (Big Four) కట్లపాము ఒకటి. దీని విషం నేరుగా నరాల వ్యవస్థపై (Neurotoxic) ప్రభావం చూపిస్తుంది.

snake 2

Krait snake bite | ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

పాము కాటు వేసిన వెంటనే నవాబ్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, శరీరంలోకి విషం వేగంగా పాకడంతో పరిస్థితి విషమించి నవాబ్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాములు, ఇతర వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు సొంత ప్రయోగాలు చేయకుండా.. వెంటనే అటవీ శాఖ అధికారులను గానీ, శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లను గానీ సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *