Shamshabad Airport | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు మరోసారి బాంబు బెదిరింపు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. లగేజీ బ్యాగ్​లో బాంబు పెట్టామని మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు.

కొంతకాలంగా దేశంలోని ఎయిర్​పోర్టులు, స్కూళ్లు, కోర్టులకు ఇటీవల తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్​పోర్టులు, విమానాల్లో బాంబులు పెట్టామని దుండగులు మెయిళ్లు పంపుతున్నారు. అలాగే కోర్టులు, బడులకు సైతం బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేగుతోంది. ఈ బెదిరింపులతో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. పలు సమాయాల్లో గాల్లో విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. అయితే బెదిరింపుల్లో 99 శాతం నకిలీవే ఉంటున్నాయి.

Shamshabad Airport | ముమ్మరంగా తనిఖీలు

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ (Bomb Threat Email) రావడంతో తీవ్ర కలకలం రేపింది. అధికారులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. టెర్మినల్ లోపల, ప్రయాణికుల లగేజ్ బ్యాగుల్లో బాంబులు అమర్చామంటూ మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్​ పోర్ట్ భద్రతా సిబ్బంది, పోలీసులు అప్రమత్తం అయ్యారు. డాగ్​ స్క్వాడ్​, బాంబు స్క్వాడ్​తో తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులను క్షణంగా తనిఖీ చేశారు. అయితే వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.

Shamshabad Airport | విదేశీ సర్వర్ల ద్వారా..

ఇటీవల ఢిల్లీ, బెంగళూరులోని పలు బడులకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబై, తెలంగాణ (Telangana), ఏపీలోని కోర్టులకు కూడా దుండగులు ఇలాంటి సందేశాలు పంపారు. దీంతో కోర్టుల సమయం వృథా అవుతోంది. చాలా వరకు నకిలీ బెదిరింపులే ఉంటున్నా… అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేస్తున్నారు. అయితే దుండగులు విదేశీ సర్వర్ల ద్వారా నకిలీ మెయిల్స్​ పంపుతున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్​గా మారింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Private Employees Union | ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజగోపాల్ యాదవ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *