అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Woman Prisoner Missing | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH)లో బుధవారం ఓ మహిళా ఖైదీ హల్చల్ చేసింది. పోలీసుల కళ్లు గప్పి ఆమె తప్పించుకుంది. దీంతో వారు ఆందోళనకు గురై ఆస్పత్రి మొత్తం జల్లెడ పట్టారు.
బాన్సువాడలో (Banswada) ఒక చోరీ కేసులో నిందితురాలు అయినా మహిళా ఖైదీ శ్రావణి తన బిడ్డతో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం వాష్‌రూమ్‌కు అని చెప్పి ఆమె తప్పించుకుంది. పై అంతస్తుకు వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె రైట్ సైడ్ మెన్ గేట్ నుంచి మిస్ అయినట్లుగా పోలీసులు అనుమానించారు.
Woman Prisoner Missing | సీసీ కెమెరాలు పరిశీలించడంతో..
ఆస్పత్రి ఎంట్రెన్స్, ఎగ్జిట్ గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వాటి నుంచి ఆమె బయటకు వెళ్లినట్లు రికార్డు కాలేదు. దీంతో ఖైదీ శ్రావణి ఆస్పత్రిలోనే దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆస్పత్రి మొత్తం జల్లెడ పట్టారు. మహిళా ఖైదీ గంట సేపు పోలీసులకు చుక్కలు చూపించింది. అనంతరం ఆమెను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనిని కూడా చదవండి : Jeevan Reddy | ‘ఆశన్నగారి’ అడుగులు ఎటువైపు..?

