Nizamabad Police Commissionerate | పెండింగ్​ కేసులను త్వరగా పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

shashi kiran Mottala
Nizamabad Police Commissionerate | పెండింగ్​ కేసులను త్వరగా పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Commissionerate | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పెండింగ్​ కేసులను దశలవారీగా వెంటనే పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో (CP Office Nizamabad) బుధవారం కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

Nizamabad Police Commissionerate | వేగంగా విచారణ పూర్తి చేయాలి..

ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని విపులంగా పరిశీలించారు. వాటిని వేగంగా విచారించి పూర్తి చేయాలని ఆయా స్టేషన్ల బాధ్యులకు సూచించారు. ప్రతి కేసును ప్రాధాన్యతతో తీసుకుని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. సాక్ష్యాధారాల సేకరణలో నాణ్యత, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సిబ్బంది పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. సమీక్ష సమావేశంలో ఆర్మూర్ (Armoor Police) ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్​బీ ఇన్​స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎన్​ఐబీ ఇన్​స్పెక్టర్​ అశోక్​, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: IPS Officers Promotion | పలువురు ఐపీఎస్​ అధికారులకు డీజీపీ హోదా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *