అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Journalist Accreditation Cards | అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందని ప్రెస్ అకాడమీ (Press Academy) ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని అంబేడ్కర్ భవన్లో జర్నలిస్టులకు వెల్నెస్ ఆస్పత్రి (Wellness Hospital) ఆధ్వర్యంలో హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Journalist Accreditation Cards | వెల్నెస్ ఆస్పత్రి సేవలు అభినందనీయం..
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వెల్నెస్ ఆస్పత్రి యాజమాన్యం జర్నలిస్టులకు ఉచిత హెల్త్ కార్డులు జారీ చేయడం అభినందనీయమన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ వెల్నెస్ హాస్పిటల్ తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిని (Former CM Rajasekhara Reddy) వర్కింగ్ జర్నలిస్టులకి వైద్య సహాయం కల్పించాలని కోరినప్పుడు రూ.2 లక్షల వరకు యూనైటెట్ ఇన్సూరెన్స్ కంపెనీతో (United Insurance Company) ఇన్స్యూరెన్స్ చేయించారన్నారు. అందులో 1/3 జర్నలిస్టులు కట్టాలని, 2/3 ప్రభుత్వం భరించిందన్నారు.
Journalist Accreditation Cards | కేసీఆర్ హయాంలో..
కేసీఆర్ హయంలో రెండేళ్లు కార్డులు పనిచేశాయని, ప్రభుత్వం (Government of Telangana) ఆస్పత్రులకు చెల్లింపులు ఇవ్వకపోవడంతో వైద్యసేవలు అందించలేకపోయారన్నారు. తాను ఛైర్మన్గా ఎన్నికైన తర్వాత బకాయిలు చెల్లించేలా చేసి కార్డులు పనిచేసేలా చేశామన్నారు. దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఉన్న కార్డులలో రెండు తెలుగు రాష్ట్రలలో ఉన్న అక్రెడిటేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నాయన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కార్డులు అందేలా చూస్తామన్నారు. డెస్క్ జర్నలిస్టులకు కూడా గతంలో లాగే కార్డులు ఇస్తామన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అక్రెడిటేషన్ ప్రక్రియలో తప్పులు లేకుండా ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ వెల్నెస్ ఆస్పత్రి యాజమాన్యం జర్నలిస్టుల కోసం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందించడం అభినందనీయమన్నారు.
Journalist Accreditation Cards | ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ మంత్రితో..
రెండు మూడు రోజుల్లో ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ మంత్రితో సమావేశం ఉందని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ వర్తించేలా అక్రెడిటేషన్ కార్డులు రూపొందిస్తున్నామన్నారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి డాక్టర్ కవితా రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, రోజు క్రమ తప్పకుండా నడక, వ్యాయామం చేయాలన్నారు. జర్నలిస్టుల సేవలను గుర్తించి, వెల్నెస్ యాజమాన్యం ఉచిత హెల్త్ కార్డులు అందించడం అంటే మామూలు విషయం కాదని, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్, డీపీఆర్వో పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: IPS Officers Promotion | పలువురు ఐపీఎస్ అధికారులకు డీజీపీ హోదా

