Car Accident Kamareddy | అదుపు తప్పి కారు బోల్తా.. నలుగురికి గాయాలు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Car Accident Kamareddy | అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటన భిక్కనూరు(bhikknoor) మండలం జంగంపల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Car Accident Kamareddy | నిర్మల్​ నుంచి హైదరాబాద్​కు..

పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ (Nirmal) నుంచి హైదరాబాద్​కు(Hyderabad) ఓ కారులో భార్యాభర్తలు పిల్లలతో వెళ్తున్నారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఒక్కసారిగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. జాతీయ రహదారిపై కారు బోల్తా పడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఇది కూడా చదవండి:Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్‌ ఏర్పాటు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *