నిజామాబాద్POLYCET Exam | పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధం..‘నిమిషం’ నిబంధన అమలు

POLYCET Exam | పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధం..‘నిమిషం’ నిబంధన అమలు

పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ తెలిపారు.

అక్షరటుడే, కామారెడ్డి: POLYCET Exam | పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2026(polycet 2026) ప్రవేశ పరీక్షకు (entrance test) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిసెట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

POLYCET Exam | కామారెడ్డి పట్టణంలో..

కామారెడ్డి పట్టణంలో (Kamareddy City) మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని విజయ్​ కుమార్​ తెలిపారు. ఈ కేంద్రాల్లో మొత్తం 2,643 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 11 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారని తెలిపారు. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, బ్లూ బాల్ పాయింట్ పెన్, హెచ్​బీ పెన్సిల్, ఎరేజర్ మాత్రమే తెచ్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ముందుగానే కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

ఇది కూడా చదవండి:Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్‌ ఏర్పాటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Annasagar Theft Case | అన్నసాగర్‌లో దొంగల బీభత్సం.. తొమ్మిది ఇళ్లలో చోరీలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Annasagar Theft Case | మండలంలోని(Yellareddy) అన్నసాగర్ గ్రామంలో...

Health Department Transfers | పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు : మంత్రి రాజనర్సింహ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Department Transfers | ప్రభుత్వం ఇచ్చిన...

Car Accident Kamareddy | అదుపు తప్పి కారు బోల్తా.. నలుగురికి గాయాలు

అక్షరటుడే, కామారెడ్డి: Car Accident Kamareddy | అదుపు తప్పి కారు...

Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్‌ ఏర్పాటు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Women Commission | రాష్ట్ర ప్రభుత్వ...