101-Foot Dharma Flag | ఎత్తైన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకం : అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

చారిత్రాత్మకమైన ఖిల్లా రామాలయంలో ఎత్తయిన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: 101-Foot Dharma Flag | చారిత్రాత్మకమైన ఖిల్లా రామాలయంలో ఎత్తయిన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

101-Foot Dharma Flag | రాష్ట్రకూటులు నిర్మించిన ఆలయం

ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ… రాష్ట్రకూట రాజులు నిర్మించి, చత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన ఖిల్లా రామాలయంలో 101 అడుగుల ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. ధర్మ కార్యానికి హిందువులంతా ఏకమవ్వాలన్నారు. నగరవాసులందరికీ కనపడేలా ఎత్తైన ధ్వజాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గురుప్రసాద్, కార్యదర్శి మారయ్య గౌడ్, మాజీ ఛైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, కోశాధికారి వాసు, గంట లింగం, హిందూ సంస్థల ప్రతినిధులు కల్పె చిరంజీవి, నరేష్, ప్రవీణ్, సూరి, సంతోష్, సాయిరాం, సాయి, సందీప్ పాల్గొన్నారు.

ytyrt

 

ఇది కూడా చదవండి..: Varalakshmi Vratham | భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు.. ఆలయాల్లో సుహాసినుల కుంకుమార్చనలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *