Varalakshmi Vratham | భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు.. ఆలయాల్లో సుహాసినుల కుంకుమార్చనలు

జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను సుహాసినులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Varalakshmi Vratham | జిల్లావ్యాప్తంగా (Nizamabad) వరలక్ష్మీ వ్రతాలను సుహాసినులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.

Varalakshmi Vratham |వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో..

నగరంలోని గంజ్​లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు సుహాసినులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సదర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు పూజల్లో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మహిళలు తమ ఇళ్లల్లోనూ వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా   పూలకు డిమాండ్​ విపరీతంగా పెరిగింది. నగరంలో రైల్వే కమాన్​, రైల్వేస్టేషన్​ వద్ద పూల దుకాణాలు, గంజ్​లో పూజాసామగ్రి దుకాణాలు సందడిగా కనిపించాయి.

puja

ఇది కూడా చదవండి: థియేటర్ లో హారతి ఇచ్చిన అభిమానులు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *