నిజామాబాద్Paddy Procurement Politics | వరి కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీల రాజకీయం: మానాల

Paddy Procurement Politics | వరి కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీల రాజకీయం: మానాల

రాష్ట్రంలో వరి కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండి పడ్డారు.

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Paddy Procurement Politics | రాష్ట్రంలో వరి కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) మండి పడ్డారు.

తమ స్వార్థ రాజకీయాల కోసం అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కమ్మర్​పల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిన అనంతరం ఐదు సీజన్లలో ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కలిగే పరిస్థితి రాకుండా చూసుకున్నామని పేర్కొన్నారు.

Paddy Procurement Politics | లారీల కొరతతో కొంత ఇబ్బంది..

ఈ సీజన్​లో కొంత లారీల కొరతతో రైస్ మిల్లర్ల ఇబ్బంది పెట్టిన సందర్భంగా కొంత ఇబ్బంది అయిన మాట నిజమేనని మానాల అన్నారు. కానీ ఎక్కడ కూడా వడ్లు కొనుగోలు చేయబోమని చెప్పలేదన్నారు. గతంలో కేసీఆర్ చెప్పినట్టు ‘వరి వేసుకుంటే ఊరే’ అనే మాటలు మాట్లాడలేదన్నారు. ఎంఎస్పీ ధర నిర్ణయించే కేంద్ర ప్రభుత్వం (Central Government) కొనుగోలు చేసే బాధ్యత ఎందుకు తీసుకోదని ప్రశ్నించారు.

Paddy Procurement Politics | 1,50,000 మెట్రిక్ టన్నుల సేకరిస్తే..

Paddy Procurement Politics

రాష్ట్రంలో 1,50,000 మెట్రిక్ టన్నుల వరి సేకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 30 వేల టన్నులు మాత్రమే మేం తీసుకుంటామని చెప్పడం సరైంది కాదని మానాల మండిపడ్డారు. దీనిపై మాట్లాడాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులకు లేదా ప్రశ్నించారు. అలాగే జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగిరెడ్డిపేట మండలంలో వరి రైతుల వద్దకు వెళ్లి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత పదేళ్లలో ఎన్నడూ ఇలా జరగనట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మీ సొంత గ్రామంలోనే చుట్టుపక్కల రైస్ మిల్లు దగ్గర గోధుములు లేవనే విషయం మర్చిపోవద్దన్నారు. నీ గ్రామంలోని ఆగిపోయిన రైస్ మిల్లు తీసుకొని ఎప్పటికప్పుడు అందులో కూడా మేం వడ్లు స్టోరేజ్ చేస్తున్నది మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు రైతులు నమ్మొద్దని.. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Paddy Procurement Politics

కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మాజీ అధ్యక్షుడు సుంకెట రవి, మాజీ డీసీసీ తిప్పిరెడ్డి శ్రీనివాస్, కమ్మర్​పల్లి టౌన్ అధ్యక్షుడు సాల్లూరి గణేష్, కుకునూరు సర్పంచ్ భూమారెడ్డి, పడగల సర్పంచ్ రాజు, అక్లూర్ సర్పంచ్ జనార్దన్, అంక్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, నరేష్, గోపాల్ అరవింద్, బైండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: No Tobacco Day | నో టొబాకో డే సందర్భంగా అవగాహన ర్యాలీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...