అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vivo T5 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ అయిన వివో మిడ్ రేంజ్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. టీ సిరీస్‌లో ఐదో మోడల్ వివో టీ5 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ , 7,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో సేల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : ఇందులో 6.83 ఇంచుల 1.5కే (1260 x 2800 పిక్సెల్స్) 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్‌తో వచ్చింది. దీంతో ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ధూళి, నీటి నుంచి రక్షణ విషయంలో ఐపీ68, ఐపీ69 రేటింగ్ సర్టిఫికెట్ కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, మీడియాటెక్ ఎన్‌పీయూ 850 ఏఐ ప్రాసెసింగ్ యూనిట్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజన్ ఓఎస్ 6తో పనిచేస్తుంది. 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
అంటుటూ బెంచ్‌మార్క్ పరీక్షల్లో ఇది 12 లక్షలకు పైగా స్కోర్ సాధించింది. గేమింగ్‌లో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు అధునాతన కూలింగ్ వ్యవస్థను పొందుపరిచారు.
Vivo T5 5G | బ్యాటరీ సామర్థ్యం..
7050 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. 44 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సింగిల్ చార్జ్‌తో 22 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
Vivo T5 5G | కెమెరా సెటప్..
వెనక వైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స882 ప్రధాన కెమెరా(ఓఐఎస్ సపోర్ట్‌తో), 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) వల్ల రాత్రి వేళల్లోనూ కదలికలు లేని స్పష్టమైన ఫొటోలు, 4కే వీడియోలు తీయవచ్చు. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఉంది.
Vivo T5 5G | నాలుగు వేరియంట్లలో..
ఈ ఫోన్ రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో, నాలుగు వేరియంట్లలో లభిస్తోంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999.
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999.
కార్డ్ ఆఫర్లు : ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి..: Sep 10 Gold prices | ఫెడ్ నిర్ణయం, క్రూడ్ ధరల ప్రభావం.. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇలా..