Sep 10 Gold prices | ఫెడ్ నిర్ణయం, క్రూడ్ ధరల ప్రభావం.. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇలా..

వడ్డీ రేట్లపై అంచనాల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బంగారం సహా కమోడిటీ మార్కెట్లలో ఒడుదుడుకులు కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 10 Gold prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం Gold ధరలు అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి వడ్డీ రేట్ల నిర్ణయం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ Oil ధరలు పసిడి మార్కెట్‌కు కీలక అంశాలుగా మారాయి.

హైదరాబాద్‌ Hyderabad లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.15,430గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,572 వద్ద ఉంది.

Sep 10 Gold prices | అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి

అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 4,456 డాలర్లకు సమీపంలో కదిలాయి. గత ముగింపుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అమెరికా ఫెడ్ పాలసీ నిర్ణయం సమీపిస్తుండటం, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇదే సమయంలో కామెక్స్ వెండి ధర కూడా బలహీనపడింది. ఉదయం ట్రేడింగ్‌లో ఔన్సు వెండి ధర సుమారు 67.93 డాలర్లకు చేరింది.

Sep 10 Gold prices | ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి

దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అక్టోబర్ కాంట్రాక్ట్ బంగారం ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు రూ.1,53,721 వద్ద స్థిరపడింది.

వెండి మాత్రం బలమైన లాభాలను నమోదు చేసింది. కిలో ధర రూ.2,44,300కు చేరి 2 శాతానికి పైగా పెరిగింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం 10 గ్రాములకు రూ.1,52,764 వద్ద, వెండి కిలోకు రూ.2,35,040 వద్ద ముగిసింది.

Sep 10 Gold prices | క్రూడ్ ఆయిల్.. పసిడికి కీలక అంశం

ప్రస్తుతం బంగారం ధరల దిశను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాల్లో క్రూడ్ ఆయిల్ ఒకటి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటడం ద్రవ్యోల్బణంపై కొత్త ఆందోళనలకు దారితీస్తోంది.

Telangana Politics | అసెంబ్లీలో లేని కేసీఆర్ చుట్టూనే సభ.. కాంగ్రెస్ ‘కేసీఆర్ నామజపం’ వ్యూహమా? వికటించే ముప్పుందా?

చమురు ధరల పెరుగుదలతో డాలర్‌కు మద్దతు లభించడంతో రూపాయి మారక విలువపై కూడా ఒత్తిడి కనిపిస్తోంది. ఈ పరిణామాలు దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Sep 10 Gold prices | ఫెడ్ నిర్ణయంపై ఇన్వెస్టర్ల చూపు

ఇప్పుడు మార్కెట్ దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ పాలసీ నిర్ణయంపై ఉంది. వడ్డీ రేట్లపై అంచనాల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బంగారం సహా కమోడిటీ మార్కెట్లలో ఒడుదుడుకులు కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగితే బంగారం వంటి వడ్డీ రాబడి ఇవ్వని ఆస్తులకు మద్దతు లభించవచ్చు. అయితే బలమైన డాలర్, అధిక బాండ్ ఈల్డ్స్ వంటి అంశాలు పసిడి ధరలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది.

Sep 10 Gold prices | నగరాల వారీగా బంగారం ధరలు..

  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,430, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,914గా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,430, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,572గా నమోదైంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,445, 22 క్యారెట్ల బంగారం రూ.14,159, 18 క్యారెట్ల బంగారం రూ.11,587గా ఉంది.
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,430, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,572గా ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,430, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,572గా నమోదైంది.
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,430, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,572గా ఉంది.
  • కేరళలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,430, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,572గా ఉంది.
  • పుణెలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,430, 22 క్యారెట్ల బంగారం రూ.14,144, 18 క్యారెట్ల బంగారం రూ.11,572గా నమోదైంది.
  • వడోదరలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,435, 22 క్యారెట్ల బంగారం రూ.14,149, 18 క్యారెట్ల బంగారం రూ.11,577గా ఉంది.

 

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *